![]() |
![]() |
.webp)
బిగ్‌బాస్ సీజన్-9 రోజుకొకరు హైలైట్ అవుతున్నారు. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగిపోతున్న ఈ సీజన్ లో కామనర్స్ ని బిబి ఆడియన్స్ అసహ్యచుకుంటున్నారు. వారి ప్రవర్తన రోజురోజుకి మరీ దారుణంగా ఉంటోంది. అయితే హౌస్ లో సోమవారం మొదలైన నామినేషన్ల ప్రక్రియ.. రెండో రోజు(మంగళవారం)న ముగిసింది. ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్లేందుకు మొత్తం ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. అయితే నిజానికి ఆరుగురు మాత్రమే లిస్ట్‌లో ఉన్నారు. కానీ సంజన కెప్టెన్ కావడంతో తనకి బిగ్‌బాస్ ఒక సూపర్ పవర్ ఇచ్చాడు. నామినేషన్స్‌లో లేని వాళ్ల నుంచి ఒకరిని నేరుగా నామినేట్ చేయాలంటూ బిగ్‌బాస్ చెప్పడంతో సుమన్ శెట్టిని ఒక సిల్లీ రీజన్‌కి చెప్పి నామినేట్ చేసింది.
నేను సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తున్నాను.. రీజన్ ఏంటంటే నేను ఆ రోజు నా ఫ్యామిలీ గురించి అందరు మాట్లాడారని కూర్చొని ఏడ్చాను. కనీసం నా కన్నీళ్లు కూడా ఇంకా డ్రై అవ్వలేదు.. అప్పుడు సుమన్ గారు వచ్చేసి మేము తొమ్మిది మంది కాదు ఎనిమిది అంటూ నవ్వారు.. అలానే మీరు నా గేమ్ చూసుంటారు సుమన్ గారు నేను ఎవర్నీ పర్సనల్‌గా తొక్కలేదు.. మీరు ఇది చేసినా కూడా ఒక్కసారి కూడా వచ్చి సారీ చెప్పలేదు.. మీకు తెలుసు నన్ను హర్ట్ చేశారని అయినా కూడా సారీ చెప్పలేదు.. అలానే కెప్టెన్‌గా మీకు ఇచ్చిన ప్యాకెట్స్‌లో ఒక్కటైనా త్యాగం చేయండి.. సిస్టర్‌గా అడుగుతున్నాను అన్నా కూడా లేదు.. నేను ఇవ్వను అన్నారు.. అలా ఆయన దగ్గరి నుంచి ఎలాంటి ఎమోషన్స్ రాకపోవడం నాకు చాలా హర్ట్ అయింది. నాకు పర్సనల్‌గా మీ మీద ఏం లేదు.. మీరు నాకు బయట కూడా తెలీదు.. నేను ఏం పర్సనల్ ఎటాక్ చేయలేదంటూ సంజన చెప్పింది. ఇంతమంది మిమ్మల్ని దొంగ అన్నా కూడా మీకు కోపం రాలేదు.. కానీ నేను అన్న ఆ తొమ్మిదవ మెంబర్ మీరే అని మీరెలా ఫిక్స్ అవుతున్నారు.. నేను అవ్వొచ్చు కదా ఆ తొమ్మిది.. మీరెందుకు మీరే అని ఫిక్స్ అవుతున్నారంటూ సుమన్ శెట్టి అడిగాడు. దీనికి ఏం చెప్పాలో తెలీక మీరు మాట తిప్పుతున్నారంటూ సంజన అంది. ఏం తిప్పాను.. నేను అడిగినదానికి చెప్పండి లేదంటే నేను పెయింట్ రాయించుకోను.. నాకు ఇష్టం లేదు.. తప్పు అది.. మీరు తప్పు చేస్తున్నారు అంటూ సుమన్ శెట్టి అన్నాడు.
ఈ పాయింట్‌కి ఆన్సర్ చెప్పకుండా సంజన ఏదేదో మాట్లాడింది. మీరు చాలా సీనియర్ ఆర్టిస్ట్ మీరు వస్తే రాస్తానని సంజన అంది. నేను అందుకే మేడమ్ అంటున్నాను.. నా కంటే పెద్దవారు కాబట్టి.. అందర్నీ ఇక్కడ చెల్లెలు అంటున్నా.. పెద్ద వాళ్లయితే అన్నయ్య అంటున్నానంటూ సుమన్ శెట్టి చెప్పుకొచ్చాడు. మీరు ఎంత తొందరగా రాయించుకుంటే అంత మర్యాద మిగులుతుందండి అంటూ సంజన మాట వదిలింది. దేనికి రీజన్ ఏంటి మేడమ్ అని సుమన్ శెట్టి మళ్లీ అడిగాడు. మీ అరుపులకి ఎవరూ భయపడరని సంజన అంటే రాయండి మేడమ్ టైమ్ వేస్ట్ కాళ్లు నొప్పెడుతున్నాయని సుమన్ శెట్టి అన్నాడు. లేదు రాయనండి అని సంజన అనగానే రాయరంట బిగ్‌బాస్ అంటూ సుమన్ శెట్టి వెనక్కి వెళ్లిపోయాడు. ఇది కాస్త ఫన్నీగా అనిపించింది. అది చూసిన సంజన ఈ కామెడీ నా దగ్గర వద్దు అంది. మొత్తానికి అసలు నామినేషన్ పాయింట్ లేకుంటా సుమన్ శెట్టిని సంజన నామినేట్ చేసింది. ఇది కంప్లీట్ గా అన్ ఫెయిర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
![]() |
![]() |